అత్యంత ఆర్జిత మహిళా అథ్లెట్‌

అత్యంత ఆర్జిత మహిళా అథ్లెట్‌

న్యూయార్క్ : ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా అథ్లెట్గా జపాన్కు చెందిన టెన్నిస్ సంచలనం నవోమీ ఒసాకా గుర్తింపు పొందారు. ఫోర్బ్స్ పత్రిక అధ్యయనం ప్రకారం గత పన్నెండు నెలల్లో ఆర్జనలో అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్ రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఒసాకా రూ.284.20 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఏడాదిలో ఒసాక ప్రైజ్మనీ, ఎండార్స్మెంట్ల రూపంలో సెరెనా కన్నా రూ. 10.64 కోట్లు (1.4 మిలియన్ డాలర్లు) అధికంగా సంపాదించింది. గత నాలుగేళ్లుగా అగ్రస్థానంలో నిలుస్తున్న సెరెనా విలియమ్స్ రెండో స్థానానికి పడిపోయింది. 22 ఏళ్ల నవోమీ ఒసాకా ఇప్పటివరకు రెండు గ్రాండ్స్లామ్ టైటిళ్లు గెలుపొందింది. ఇప్పటివరకు రష్యా మాజీ క్రీడాకారిణి మరియా షరపోవా పేరుతో ఉన్న రికార్డును ఆమె చెరిపివేసింది. షరపోవా 2015లో 29.7 మిలియన్ డాలర్లు సంపాదించింది. ఇక ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న 100 మంది అథ్లెట్లతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో ఒసాకా 29వ స్థానంలో నిలిచింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos