కోల్కతా: ఢిల్లీ: సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించేందుకు వచ్చే సోమవారం న్యూ ఢిల్లీలో నిర్వహించ దలచిన విపక్షాల సమావేశాలకు హాజరు కాబోనని పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమత బెనర్జి గురువారం ఇక్కడ ప్రకటించారు. పశ్చిమ బంగలో కాంగ్రెస్, వామపక్షాలు నీచ రాజకీయాలకు పాల్పడు తున్నందున ఈ నిర్ణయాన్ని తీసుకు న్న ట్లు వివరించారు. ఈ సమావేశానికి సోనియా గాంధీ, డీఎంకే అధిపతి స్టాలిన్, వామపక్షాల నేతలు సీతారామ ఏచూరి, డి.రాజా తదితరులు హాజరు కానున్నారు.