సిఏఏను విపక్ష పాలకులంతా వ్యతిరేకించాలి

సిఏఏను విపక్ష పాలకులంతా వ్యతిరేకించాలి

కోల్కతా:నూతన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆయా శాసనసభల్లో తీర్మానాల్ని చేయాలని ఈశాన్య రాష్ట్రాలకు, విపక్ష పాలిత రాష్ట్రాలకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపు నిచ్చారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లా డారు. జాతీయ జనాభా పట్టిక తయారీకి ముందు దాన్ని ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు, విపక్ష పాలిత రాష్ట్రాలు క్షుణ్ణంగా అధ్య యనం చేయాలనీ విన్నవించారు. ‘సీఏఏను వ్యతిరేకిస్తున్నవారిపై కేంద్రం ఆక్రోశించటం సిగ్గుచేటు. అలాంటి నేతల వ్యాఖ్యలకు నేను స్పందించను. రాబోయే ప్రమాదాన్ని పసిగట్టే ప్రజలు నిరసిస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా మేము తీర్మానం చేస్తాం. అంతా అంగీకరిస్తే కోల్కతాలో విపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేస్తాం. ఎన్ఆర్సీని సపోర్ట్ చేసే షరత్తుల్ని ఎన్పీఆర్ తొలగిం చాలి. సీఏఏ, ఎన్పీఆర్ల పేరుతో ప్రమాదకరమైన ఆట ఆడుతోంది. అన్ని విపక్ష పార్టీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావా ల’ని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos