కోల్కత్తా: దేశ రక్షణకు ఏకం కావాలని కోరుతూ విపక్షాలకు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళ వారం లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వ అమానుష పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. తనలో నెలకొన్న తీవ్రమైన ఆవేదనతో లేఖలు రాసినట్లు చెప్పారు. సీఏఏ, ఎన్ఆర్సీపై కులంతో సంబంధం లేకుండా భారత పౌరులు, మైనారి టీలు, ఓబీ సీలు, ఎస్సీ, ఎస్టీలు, రైతులు, చిన్నారులు, మహిళలు భయపడుతున్నారని వివరించారు. వాటిపై పోరాటానికి సీనియర్ నాయ కులు, రాజకీయ నేతలు అందరూ ఏకం కావాలని కోరారు. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుదామని ఆకాంక్షిం చారు.