గౌహతి: శివసాగర్ జిల్లాలోగత ఏప్రిల్ 21న అపహరణకు గురైన ఓఎన్జీసీ అధికారి రితుల్ సైక్యాను శనివారం ఉదయం విడుదలయ్యారు. మొత్తం ముగ్గురు ఓఎన్జీసీ అధికారులను ఉల్ఫా ఉగ్రవాదులు అపహరించారు. ఇద్దరిని ఏప్రిల్ 24న పోలీసులు కాపాడారు. శనివారం ఉదయం 7 గంటలకు.. మయన్మార్ సరిహద్దులో సైక్యాను విడిచిపెట్టారు. భారత భూభాగంలోకి వచ్చిన తర్వాత నాగాలాండ్ పోలీసులు అతన్ని మోన్ పోలీస్ స్టేషన్లో కొద్దిసేపు విచారించి ఇంటికి పంపించినట్లు అధికారులు తెలిపారు.