రాజా సింగ్‌కు ఏడాది జైలు

రాజా సింగ్‌కు ఏడాది జైలు

హైదరాబాద్: బీజేపీ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు షాక్ తగిలింది. ఆయనకు నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఐదేళ్ల క్రితం బీఫ్ ఫెస్టివల్ వివాదంలో రాజా సింగ్‌పై కేసు నమోదయిన సంగతి తెలిసిందే. కార్యక్రమం సందర్భంగా రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కోర్టు నేడు రాజా సింగ్‌కు ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. అనంతరం బెయిల్ మంజూరు చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos