అనర్హత ఎమ్మెల్యేల పిటిషన్ వాయిదా..

అనర్హత ఎమ్మెల్యేల పిటిషన్ వాయిదా..

కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి కారణమైన 17 మంది అనర్హత ఎమ్మెల్యేల అనర్హతవేటుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.అనర్హత వేటుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుపుతున్న న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నుంచి జస్టిస్ మోహన్ వైదొలగడంతో మరోసారి పిటిషన్ వాయిదా పడింది.ప్రస్తుత పరిస్థితుల్లో పిటిషన్‌పై విచారణ జరపలేమని వచ్చే సోమవారం విచారణ చేయనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీనామా చేయడంతో అప్పటి సభాపతి రమేశ్కుమార్ 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos