విండీస్ జట్టులోకి కీమోపాల్

  • In Sports
  • August 28, 2019
  • 191 Views
విండీస్ జట్టులోకి కీమోపాల్

ఆంటిగ్వా : ఇండియాతో జరిగే రెండో టెస్టుకు విండీస్ జట్టులో ఓ మార్పు జరిగింది. పేస్ బౌలర్ మిగెల్ కమిన్స్ స్థానంలో ఆల్‌ రౌండర్ కీమోపాల్‌కు  చోటు లభించింది. మడమ గాయంతో అతను తొలి టెస్టుకు దూరమయ్యాడు. రెండో వికెట్ కీపర్ జామర్ హ్యామిల్టన్ జట్టులోనే కొనసాగాలని తాత్కాలిక సెలెక్షన్ కమిటీ ఆదేశించింది. తొలి టెస్టులో ఇండియా 318 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అంతకు ముందు టీ20, వన్డే సిరీస్‌లను భారత్ క్లీన్ స్వీప్ చేసి, టెస్టు సిరీస్‌లో కూడా అదే ఫలితం కోసం ఉత్సాహంతో ఎదురు చూస్తోంది. విండీస్ జట్టు: జేసన్ హోల్డర్ (సారథి), క్రెయిగ్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రావో, షమ్రా బ్రూక్స్, జాన్ క్యాంప్‌బెల్‌, రోస్టన్ ఛేజ్, రకీమ్ కార్న్‌వాల్, జామర్ హ్యామిల్టన్, షానన్ గాబ్రియేల్, షిమ్రన్ హె టెమయిర్, షై హోప్, కీమో పాల్, కీమర్ రోచ్.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos