ఓబీసీల్ని వంచిస్తున్న భాజపా

లఖ్నవూ:ఉత్తర ప్రదేశ్‌లో 17 కులాలను ఎస్సీ జాబితాలో కలపాలని ప్రభుత్వం నిర్ణయించటం రాజ్యాంగ వ్యతిరేకమే కాకుండా కేవలం రాజకీయ చర్యని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సోమవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. వచ్చే ఉప ఎన్నికల్లో గెలుపునకు భాజపా కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు. ‘ ఇప్పటి వరకూ ఓబీసీ జాబితాలో ఉన్నా వారిలో 17 కులాల్ని ఎస్సీ జాబితాలో చేర్చనున్నట్లు మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. యోగి ప్రభుత్వం వారిని వంచిస్తోంది. ఏ వర్గంలో ఉన్నప్పటికీ వారికి లబ్ధి చేకూరదు. ఏ ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గం నుంచి ఏ కులాన్నీ తొలగించ జాలదు. కలపజాలదు. ప్రభుత్వం ఇలాంటి చర్యల్ని చేపట్టకుండా రాజ్యాంగంలోని 341 అధీకరణ నిరోధిస్తుంద’ని వ్యాఖ్యానించారు. ఇటు వంటి నిర్ణయాలు తీసుకునే అధికారం కేవలం రాష్ట్రపతి, పార్లమెంటుకే ఉందన్నారు. ‘341 అధీకరణ ప్రకారం గవర్నర్ సూచనలతో నోటిఫికేషన్ విడు దల చేసి ఎస్సీలోకి ఇతర కులాలను చేర్చే ప్రక్రియ రాష్ట్రపతి ద్వారా జరుగుతుంది. సంబంధిత నోటిఫికేషన్లో మార్పులను పార్లమెంటు మాత్రమే చేయ గలదని ఆ అధీకరణలోని రెండో భాగం పేర్కొంటోంది. ఓబీసీ కేటగిరిలోని ఆ సామాజిక వర్గాలను మోసం చేయాలని యోగి సర్కారు ప్రయత్నిస్తోంద’ని అని మండి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos