కలబురగి: అఫ్జల్పుర్ తాలుకా ఆసుపత్రిలో ప్రాణవాయువు కొరతతో నలుగురు కరోనా రోగులు మంగళవారం మృతి చెందారు. ఆస్పత్రిలో సోమవారం నుంచి ఆక్సిజన్ కొరత ఏర్పడింది. మంగళవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో పరిస్థితి మరింత తీవ్రమైంది. ప్రాణవాయువు సమస్యతో అక్కడి కొవిడ్ రోగులు తీవ్ర ఇబ్బందుల పడ్డారు. వారిలో నలుగురు మృతి చెందారు. వారంతా ఆక్సిజన్ లేకపోవడం వల్లే మరణించారని చెప్పలేమని అక్కడి వైద్యాధికారి రత్నకర తోరాణా తెలిపారు. ‘తాలుకాలో ప్రాణవాయువు కొరత ఉంది. ఈ విషయమై జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేశాం. ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది’ అని అన్నారు.