న్యూజిలాండ్ కాల్పుల అనుమానితుని నిర్బంధం

న్యూజిలాండ్ కాల్పుల అనుమానితుని నిర్బంధం

క్రైస్ట్‌చర్చ్‌ : న్యూజిలాండ్‌లోని రెండు మసీదుల్లో కాల్పులకు తెగబడినట్లుగా అనుమానిస్తున్న వ్యక్తిని పోలీసులు శనివారం కోర్టులో హాజరుపరిచారు. అతను ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ టారంట్. వయసు 28 ఏళ్లు. కోర్టులో విచారణ సందర్భంగా అతను మౌనాన్ని ఆశ్రయించాడు. కోర్టు అతనిని వచ్చే నెల నాలుగో తేది వరకు కస్టడీకి పంపింది. అతనిపై హత్య కేసు నమోదైంది. మరిన్ని అభియోగాలు మోపే అవకాశం కూడా ఉంది. క్రైస్ట్‌చర్చ్‌లోని రెండు మసీదుల్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 49 మంది మరణించిన సంగతి తెలిసిందే. మృతుల్లో ఓ హైదరాబాదీ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కాగా ఈ సంఘటన అనంతరం దేశంలో తుపాకుల చట్టాన్ని మార్చనున్నట్లు ప్రధాని జసిండా అర్డెర్న్ ప్రకటించారు. సెమీ-ఆటోమేటిక్ ఆయుధాలను నిషేధించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని అటార్నీ జనరల్ డేవిడ్ పార్కర్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos