అర్జున్‌రెడ్డి విజయం అనంతరం విజయ్ దేవరకొండ స్థాయి స్టార్ హీరోల రే్ంజుకు వెళ్లిపోయింది. అర్జున్‌రెడ్డి అనంతరం విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్‌గా మారిపోయాడు.అప్పటి నుంచి అభిమానులు విజయ్‌ను రౌడీగా పిలవడం ప్రారంభించారు.అలా తెలుగు చిత్రసీమ రౌడీగానే చలామణి అవుతూ వస్తున్న విజయ్ కొద్ది రోజుల క్రితం రౌడీ అనే బ్రాండ్‌ను కూడా ప్రారంభించాడు.ఈ క్రమంలో కొంతమంది విజయ్ అభిమానులు తమ బైకుల నంబర్ ప్లేట్లపై రౌడీ అని రాసుకొని తిరుగుతుండగా ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.ఈ విషయం విజయ్‌కు తెలియడంతో వెంటనే స్పందించారు. అన అభిమానులు చేసిన పనికి పోలీసులకు తాను క్షమాపణ చెబుతున్నానని ఇకపై ఇటువంటివి పునరావృతం కాకుండా అభిమానులకు అవగాహన కల్పిస్తానంటూ పోలీసులకు ట్వీట్ చేశాడు.అదే సమయంలో అభిమానులను ఉద్దేశించి కూడా ట్వీట్ చేశాడు.మీకు మీ కుటుంబం లేదా దేవుడు లేదా స్నేహితులపై అభిమానం ఉంటే బైకులపై ఏ ఇతర భాగాల్లోనైనా చూపించుకొండి అయితే నంబర్ ప్లేట్లను మాత్రం కేవలం నంబర్లకు మాత్రమే వదిలేయాలంటూ కోరాడు..
