ఆర్ఆర్ఆర్ చిత్రంతో తీరిక లేకుండా గడుపుతున్న తారక్-చరణ్‌లు తాజాగా ఓ అభిమానితో కలసి ఫోటో దిగారు. ఓ అభిమానితో వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోతో పాటు బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జనవరి మొదటి వారం నుండి ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రచారాలు మొదలు కానున్నాయి.ముందుగా ప్రకటించినట్లు వచ్చే ఏడాది జులై నెలలో ఎట్టిపరిస్థితుల్లోనూ చిత్రాన్ని విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.