అరవింద సమేత అనంతరం ఎన్టీఆర్,త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో కొత్త చిత్రం తెరకెక్కడానికి సిద్ధమవుతోందని తెలుగు చిత్రసీమలో వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.ప్రస్తుతం ఇద్దరు వేర్వేరు చిత్రాలతో బిజీగా ఉన్నారు.ఎన్టీఆర్ ‘ఆర్ ఆర్ ఆర్‘ సినిమాలో నటిస్తుండగా అల వైకుంఠపురం సినిమా పనులతో త్రివిక్రమ్ తీరికలేకుండా వున్నాడు.ఫిబ్రవరి నాటికి ఇద్దరి చిత్రాలు పూర్తి కానుండడంతో అటుపై ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి రంగం సిద్ధమవుతోంది.కాగా ఈ సారి చేయనున్న సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉండేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్‘ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతంగా పెరిగే అవకాశం ఉండడంతో ఎన్టీఆర్ మార్కెట్ పరిధి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ ను త్రివిక్రమ్ సిధ్ధం చేయనున్నాడట.త్రివిక్రమ్ తన మార్క్ నుంచి బయటికి వచ్చి చేసే ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లు చిత్రసీమలో వార్తలు వినిపిస్తున్నాయి.