అమరావతి: ఆంధ్ర ప్రదేశ్‌కు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని అప్పట్లో రాజ్యసభలో వెంకయ్య నాయుడు కోరటమూ నాటక మేనా? అని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఇక్కడ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణను ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో బీజేపీ పెట్టలేదా?ని అడిగారు. కశ్మీర్ పై చూపుతున్న శ్రద్ధలో కనీసం పదో వంతైనా ఆంధ్రప్రదేశ్‌పై చూపాల న్నారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు రూ. 24,350 కోట్లుకు బదులుగా ముష్టిగా రూ. 1,050 కోట్లు ఇవ్వడం నిజం కాదా? అని ప్రశ్నిం చారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు రూ. 5 లక్షల కోట్లుకు బదులుగా ఎంగిలి మెతుకులు విసిరినట్టు రూ. 16 వేల కోట్లు ఇచ్చారని మండి పడ్డారు.