చిన్ననాటి స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను రెడ్హ్యాండెడ్గా పట్టుకునేందుకు విదేశాల నుంచి వచ్చిన భర్త అర్ధరాత్రి ఇంటికెళ్లి తలుపుకొట్టగా అక్కడ కనిపించిన మరో దృశ్యం అతడిని దిగ్భ్రాంతికి గురిచేసింది.సూర్యాపేట జిల్లా నడిగూడేనికి చెందిన వ్యక్తికి అదే జిల్లాకు చెందిన యువతితో పదేళ్ల క్రితం వివాహమైంది. ఆ తర్వాత కొన్ని రోజులకే హైదరాబాద్ వచ్చి కొత్తపేటలోని వాసవీకాలనీలో ఇద్దరు పిల్లలతో కలసి కాపురం పెట్టారు.కొద్ది కాలం క్రితం భర్త ఎంఎస్ చదివేందుకు ఆరేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్లేవాడు.భర్త దూరంగా ఉండడంతో భార్య తన చిన్ననాటి స్నేహితుడైన వైద్యుడు శివప్రసాద్కు దగ్గరైన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది.విషయం తెలిసిన భర్త.. భార్యకు ఫోన్ చేసి హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో భార్యను రెడ్హ్యాండెడ్గా పట్టుకునేందుకు భార్యకు తెలియకుండా 20 రోజుల క్రితం రహస్యంగా హైదరాబాద్ చేరుకుని ఆమెపై నిఘాపెట్టాడు. ఆమె తప్పించుకోకుండా దొరకాలని సమయం కోసం ఎదురుచూశాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి భార్య, తన స్నేహితుడితో కలిసి ఉండగా వెళ్లి తలుపుకొట్టాడు.తలుపు తెరిచిన భార్య నివ్వెరపోయింది. లోపలున్న శివప్రసాద్ను చూసి ఇక్కడ ఎందుకున్నావని భర్త ప్రశ్నించాడు. దీనికి అతడు స్పందిస్తూ.. తాను ఎప్పుడైనా వస్తానని, ఎక్కువ మాట్లాడితే చంపేస్తానని బెదిరించాడు. వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. బాధిత భర్త అప్పటికే పోలీసులకు సమాచారం అందించడంతో వారు అదే సమయానికి అక్కడికి చేరుకుని శివప్రసాద్ను, బాధితుడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారితో మాట్లాడుతుండగానే అక్కడ మరో షాకింగ్ ఘటన జరిగింది. ఆ ఇంట్లోని మరో గదిలో నిందితురాలి స్నేహితులైన నరేశ్, మరో యువతి పట్టుబడ్డారు. వీరు కూడా దంపతులు కాదని తమ భార్య,భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధం నెరుపుతున్నారని నిర్ధారించుకుని అందరినీ అరెస్ట్ చేశారు.