
న్యూఢిల్లీ:ప్రవాస భారతీయుల సంఖ్య కోటీ ముప్పై లక్షలు. మన దేశంలో ఓటర్లుగా నమోదు చేసుకున్న వారి సంఖ్య కేవలం 71 వేల మంది మాత్రమే. వీరిలో 92 శాతం మంది మలయాళీలే కావటం గమ నార్హం. పుట్టిన దేశంలో ఓటేసే హక్కు కల్పించాలని ప్రవాస భారతీయ సంస్థలు చాలా కాలంగా డిమాండు చేసారు. మొదట్లో పాలకులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎట్టకేలకు 2010లో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి ప్రవాస భారతీయులకు ఓటు హక్కు కల్పించారు.ఓటర్లుగా నమోదు చేసు కునేందుకు ప్రవాస భారతీయులు పెద్దగా ఆసక్తి చూపటం లేదిప్పుడు. ప్రవాస భారతీయ సంస్థల వైఖరీ ఇందుకు భిన్నంగా లేదు. 2012 లో ప్రవాస భారతీయ ఓటర్ల సంఖ్య పది వేలు కాగా 2019 నాటికి తాజా 71,735కు చేరుకుంది. ఇందులో 92 శాతం-66,584 మంది మల యాళీలు. మిగిలిన రాష్ట్రాల్లో నమోదైన ఎన్నారై ఓటర్ల సంఖ్య 5,151. ఇరవై మంది హిజ్రాలు కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవడం గమనార్హం.