డార్జిలింగ్: ‘నేను మీతోనే ఉన్నాను. మిమ్మల్ని ఎవరూ ముట్టుకునే సాహసం చేయలేరు. ఇది మన భూమి. ఇక్కడ వారిని ఎవరూ విభజించలేర’ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భరోసా ఇచ్చారు. బుధవారం ఇక్కడ జరిగిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)కి వ్యతిరేక ర్యాలీలో ప్రసంగించారు. పౌరులు ‘నో ఎన్ఆర్సీ’ అనే నినా దాల్ని రాసిన అట్టల్ని, రు జాతీయ జెండాలు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ గురించి పశ్చిమ బెంగాల్ ప్రజ లు ఆందోళన చెందాల్సిన పని లేదు. బెంగాల్ ప్రజలపై వీటి ప్రభావం పడనీయనని భరోసా ఇచ్చారు.