
అమరావతి :రాష్ట్ర ఎన్నికల ప్రధాన
అధికారి ద్వివేది సోమవారం ఉదయం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల అధికారిక
ప్రకటన విడుదల చేసారు.25 లోక్‌సభ, 175 విధానసభ నియోజకవర్గాలకు జిల్లాల వంతున
అధికార ప్రకటనల్ని విడుదల చేయాలని జిల్లా ఎన్నికల అధికార్లు కూడా అయని కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం నుంచి ఈ నెల
25 వరకూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామ పత్రాల్ని స్వీకరిస్తారు. 26
న నామ పత్రాల్ని పరిశీలిస్తారు. 27, 28ల్లో వాటిని ఉపసంహరించుకో వచ్చు. ఏప్రిల్
11న ఎన్నికల జరగనుంది. మే 23న ఓట్లు లెక్కిస్తారు.