హిందీ,తెలుగు
భాషల్లో పలు చిత్రాల్లో నటించిన సమీరారెడ్డి 2014లో సినిమాలకు వీడ్కోలు పలికి అక్షయ్
అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.ఇప్పటికే సమీర,అక్షయ్‌లకు ఓ బాబు
ఉండగా తాజాగా సమీరా మరోసారి తల్లి కాబోతుంది.అందుకు సంబంధించి ఫోటోలను సమీరారెడ్డి
సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశారు.ఈ ఫోటోలపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్ చేశారు.అందులో
ఒక నెటిజన్ సమీరా ఒకప్పటిలా నాజూగ్గా లేదని పెళ్లయ్యాక లావుగలా అందవిహీనంగా తయారయ్యిందంటూ
కమెంట్ చేశాడు.దీంతో సమీరాకు చిర్రెత్తుకొచ్చింది. అందరూ కరీనా కపూర్‌లా నాజూగ్గా
ఉండలేరని పెళ్లయి పిల్లలు పుట్టాక కొంతమంది లావుగా మారతారని తాను రెండవ రకమన్నారు.నా
శరీరం గురించి కమెంట్ చేసిన వాళ్లకు ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నానని మీరు పుట్టాక మీ
అమ్మ మునుపటిలానే అందంగా ఉన్నారా అంటూ ప్రశ్నించింది.మహిళ శరీరాకృతిపై హేళన చేస్తూ
వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటంటూ నెటిజన్లు గడ్డి పెట్టారు సమీరారెడ్డి..