తెలంగాణ రాష్ట్రంలోని
17 లోక్‌సభ స్థానాలకు ప్రధాన పార్టీలతో పాటు వందల సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు దాఖలు
చేసిన నామినేషన్ల పరిశీలన పర్వం మంగళవారంతో ముగిసింది.నామినేషన్ల పరిశీలన అనంతరం భువనగిరి
మినహా మిగిలిన 16 లోక్‌సభ స్థానాలకు సంబంధించిన వివరాలను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన
అధికారం కార్యాలయం ప్రకటించింది.16 స్థానాలకు మొత్తం 612 మంది అభ్యర్థులు నామినేషన్లు
దాఖలు చేయగా అందులో వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు.అన్ని
నియోజకవర్గాలపైకి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పోటీ చేయనున్న నిజామాబాద్ నియోజకవర్గానికి
అత్యధికంగా నామినేషన్లు దాఖలవగా అందులో 191 మంది నామినేషన్లను అధికారులు ఆమోదించారు.ఈనెల
28వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉండడంతో అప్పటివరకు ఎంతమంది బరిలో
నిల్చుంటారో ఎంతమంది నామినేషన్లు ఉపసంహరించుకుంటారో చూడాల్సి ఉంది.ఒకవేళ అందరూ ఎన్నికల
బరిలో నిల్చుంటే ఈవీఎంలకు బదులు బ్యాలెట్ వాడడం తప్పనిసరి అవుతుంది. భువనగిరి స్థానంలో
ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ పత్రాలను అధికారులు తిరస్కరించడంతో ముగ్గురు
అభ్యర్థులను నామినేషన్ల పునఃపరిశీలనం కోసం అప్పీల్ చేయడంతో భువనగిరి వివరాలను పెండింగ్‌లో
ఉంచారు..