ఇథియోపియా ప్రధానికి నోబెల్ శాంతి పురస్కారం

ఇథియోపియా ప్రధానికి నోబెల్ శాంతి పురస్కారం

స్టాక్హోమ్ : నోబెల్ శాంతి బహుమతి ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ను వరించింది. ఇథియోపియాకు, ఎరిత్రియాకు మధ్య ఉన్న సరిహద్దు సమస్య పరిష్కారానికి చేసిన కృషికి పురస్కారాన్ని అందించినట్లు నోబెల్ బహుమతి సమితి ప్రకటించింది. సరిహద్దు వివాదంపై ఎరిత్రియా-ఇథి యోపియాకు మధ్య 1998-2000 మధ్య యుద్ధం జరిగింది. నిరుడు జూలైలో మళ్లీ రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు నెలకొన్నాయి. ఇందు కు అబీ చాలా కృషి చేశారు. నోబెల్ పురస్కారం కింద అబీ అహ్మద్ కు 9 లక్షల అమెరికా డాలర్ల నగదు అందుతుంది. స్వీడన్ లోని ఓస్లోలో డిసెంబర్ 10న పురస్కారాన్ని అందిస్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos