అంపైర్ తప్పిదంపై కోహ్లీ ఆగ్రహం

  • In Sports
  • March 29, 2019
  • 187 Views

బెంగళూరు : ఐపీఎల్ లీగ్‌ఓ భాగంగా గురువారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో అంపైర్ చేసిన తప్పిదంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్ ఆటగాడు లసిత్ మలింగ 20వ ఓవర్ వేశాడు. ఆ ఓవర్లో 17 పరుగులు చేస్తే విజయం ఆర్సీబీ సొంతమవుతుంది. ఆర్సీబీ బ్యాట్స్‌మన్‌ శివం దుబే మొదటి బంతిని సిక్స్‌గా మలచడంతో ఆ జట్టులో గెలుపుపై ఆశలు మొలకెత్తాయి. తర్వాతి నాలుగు బంతులకు నాలుగు సింగిల్స్ వచ్చాయి. ఆఖరు బంతికి ఏడు పరుగులు చేయాల్సి ఉంది. దానిని మలింగ ఫుల్‌టాస్‌గా వేశాడు. దానిని నో బాల్‌గా ప్రకటించాల్సి ఉండగా, అంపైర్ స్పందించలేదు. దీనిపై మ్యాచ్ అనంతరం కోహ్లీ స్పందిస్తూ, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మేం ఐపీఎల్ ఆడుతున్నాం, గల్లీ క్రికెట్ కాదు, అంపైర్లు దీనిని గమనించాలని అన్నాడు. ఉత్కంఠభరితమైన పోరులో ఇలాంటి తప్పిదాలు జరుగకూడదు. వాళ్లు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అని వ్యాఖ్యానించాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ దీనిపై మాట్లాడుతూ, మైదానం వెలుపలికి వచ్చాక, మలింగ చివరన నో బాల్ వేశాడని ఎవరో చెప్పారని తెలిపాడు. ఇలా జరగడం మంచిది కాదని, కొన్ని సార్లు అంపైర్ల తప్పిదాలు గెలుపోటములను తారుమారు చేస్తాయని అన్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos