చిరంజీవితో గొడవలు లేవు..

  • In Film
  • January 3, 2020
  • 129 Views
చిరంజీవితో గొడవలు లేవు..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జరిగిన గొడవ అనంతరంమాకార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నటుడు రాజశేఖర్.. ట్విట్టర్ వేదికగా స్పందించారు. గురువారం నాటి గొడవను పెద్దదిగా చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తనకు, చిరంజీవికి, మోహన్బాబుకి మధ్య ఎలాంటి గొడవలు కానీ, అపోహలు కానీ లేవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తన వల్ల జరిగిన గొడవకు క్షమాపణలు వేడుకుంటున్నట్టు రాజశేఖర్ తెలిపారు.తన పదవికి రాజీనామా చేశానని, పరిశ్రమకు తన వంతు సాయం ఏది అవసరమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. చిరంజీవి, మోహన్బాబుపై తనకు అమితమైన గౌరవం ఉందని, ‘మాకు వారి సేవలు అవసరమని అన్నారు. గొడవను తమ ముగ్గురి మధ్య జరిగిన గొడవగా చూడొద్దని కోరారు. గురువారం ఏం జరిగినా అది తనకు, నరేశ్కు, ‘మాకు మధ్య మాత్రమే జరిగినదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు. ఒక్క పనీ సరిగా జరగకపోవడం వల్ల తాను మాట్లాడకుండా ఉండలేకపోయానని రాజశేఖర్ స్పష్టం చేశారు. మా` డైరీ ఆవిష్కరణ లో రాజశేఖర్ ఎమోషనల్ గా మాట్లాడి అంతర్గత వ్యవహారాల పై బయట పడిపోవడం వేదిక పై పెద్దలెవరికీ నచ్చలేదు. మీడియా ముందు అలుసైపోతున్నామని వారించినా .. రాజశేఖర్ తగ్గక పోవడం ఎవరికీ రుచించలేదు. దాంతో వెంటనే మెగాస్టార్ చిరంజీవికృష్ణం రాజు ఆయన పై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా కమిటీని కోరిన విషయం తెలిసిందే..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos