ఇన్‌స్టాగ్రామ్‌లో సరదాగా అభిమానులతో చాట్ చేస్తోన్న హీరోయిన్ నివేదా థామస్ కు చేదు అనుభవం ఎదురైంది. కొందరు నెటిజన్లు తనను అసభ్యకర ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారని తెలిపింది. దీంతో తనతో చాట్ చేయడానికి సమయం కేటాయించిన వారందరికి కృతజ్ఞతలు అంటూ చాటింగ్ ఆపేశారు. చాలా మంది ప్రశ్నలకి సమాధానం ఇచ్చానని, కొందరు అడిగిన అసభ్యకర ప్రశ్నలు తనను చాలా ఇబ్బంది పెట్టాయని తెలిపింది.ఓ నెటిజన్ ఆమెను ‘నువ్వు వర్జినేనా’ అని ప్రశ్న అడిగాడు. అంతేకాదు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని కూడా ప్రశ్నించాడు. నెటిజన్లు చాట్ చేసేది మనిషితోనే అనే విషయం మరచిపోవద్దని, అందరికి మర్యాద ఇవ్వాలని నివేదా థామస్ కోరింది. త్వరలో మళ్లీ కలుద్దాం అటూ గుడ్ బై చెప్పేసింది.