పాట్నా: గతంలో ఎన్నడూ లేని రీతిలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతోంది. తాజాగా నితీష్ మరో చేదు అనుభవాన్ని చవి ఊసారు. మధుబని నియోజక వర్గంలోని హర్లాఖిలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో నిరుద్యోగం గురించి నోరు విప్పిన వెంటనే సభలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి నితీష్పైకి ఉల్లిపాయలు, రాళ్లు విసిరాడు. అంతే సభలో ఉన్న జనాలు కూడా ఆయనపైకి ఉల్లిపాయలు విసరడం ప్రారంభించారు. భద్రతా సిబ్బంది వారిని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. రాష్ట్రంలో మధ్య నిషేధం అమలులో ఉన్నప్పటికీ అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయంటూ ఉల్లిపాయలు విసురుతూనే ఉన్నారు. అయితే తనపైకి ఉల్లిపాయలు విసరడంపై స్పందిస్తూ ‘‘అతడిని అడ్డుకోకండి. విసరనివ్వండి. కావాల్సినన్ని విసరనివ్వండి’’ అని చెప్పుకొచ్చారు.