బేరింగ్‌ చేతికి నిట్

బెంగళూరు: నిట్‌ టెక్నాలజీస్‌ను బేరింగ్‌ ప్రైవేట్‌ ఈక్విటీ ఏషియా సంస్థ కొనుగోలు
చేయనున్నట్లు సమాచారం.  ప్రస్తుత మార్కెట్‌ విలువ కంటే కొంచెం అధిక మొత్తానికి  దీని  కొనుగోలుకు సిద్ధమైంది. ఇందు కోసం నాలుగు బ్యాంకుల నుంచి  బేరింగ్‌ సంస్థ  నిధుల్ని సమీకరించనుంది. నిట్‌ టెక్నాలజీస్‌ విలువ రూ.8,500 కోట్లుగా లెక్కగట్టారు. నిట్‌లో రాజేంద్ర పవార్‌, విజయ్‌ థడానీకి 30.8శాతం వాటా ఉంది. 26శాతం వాటాను ఓపెన్‌ ఆఫర్‌లో కొనుగోలు చేయాల్సి ఉంది. బేరింగ్‌ ఒక్కో షేరుకు రూ.1,300-రూ.1,380వరకు చెల్లించేందుకు సిద్ధమైంది. ఇది షేర్‌ వాస్తవ ధర కంటే 8 నుంచి 15శాతం వరకు అధికం. సోమవారం నిట్‌ షేరు రూ.1,328 వద్ద ట్రేడింగ్‌ జరిగింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos