ముంబై : ‘అంతర్గత పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం చాలా రోజులు ఇంకా పార్టీలో కొనసాగలేన’ని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ శుక్రవారం ఇక్కడ ప్రకటిం చారు. విధానసభ ఎన్నికల ప్రచారానికి దూరమైన ఆయన పార్టీని వీడాలనే ఆలోచన మాత్రం తనకు లేదని తొలుత అన్నారు. ఆయన అనుచరులైన కొందరికి మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీకి అవకాశం లభించక పోవటంతో అలకబూనారు. చాలా ఏళ్లుగా ముంబై కాంగ్రెస్కి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న ఆయన్ను నాయకత్వం కొన్ని రోజుల కిందట ముంబై నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి మిలింద్ దేవరాకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించింది.