అమరావతి:‘కేంద్రానికి నేను రాసినట్లుగా ప్రచారం జరుగుతున్న లేఖను నేను రాయ లేదు.అసలు ఆ లేఖకు,నాకు సంబంధం లేదు. ఈ లేఖను నేను రాసినట్లు సృష్టించిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయనున్నాన’ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గురువారం ఇక్కడ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.నా ప్రాణాలకు ముప్పు ఉందని భావించడం లేద’ని స్పష్టీ కరించారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదాకు నిర్ణయించిన తరువాత, బెదిరింపులు పెరిగాయని,తనకు ప్రాణహాని ఉందని, భద్రతను కల్పించాలని ఆయన హోమ్ శాఖకు లేఖ రాసినట్లు గురువారం పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి.ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది? సృస్టికర్త ఎవరు? తదితర అంశాల గురించి పోలీసులు విచారిస్తున్నారు.