నీరవ్‌ మోదీ అరెస్టు

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా ఫరారైపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని లండన్లో అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం అక్కడి కోర్టులో హాజరు పరచనున్నట్టు తాజా సమాచారం. నీరవ్ మోదీ, అతడి మేనమామ మోహుల్ చోక్సీ కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సుమారు రూ.14 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టారు. నీరవ్ మోదీని భారత్‌కు రప్పించి ఆయనపై చర్యలు తీసుకునే మార్గాన్ని సుగమం చేయాలని కోరుతూ ఈడీ గత మార్చి 9న బ్రిటన్ హోం శాఖకు లేఖ రాసింది. దరిమిలా లండన్ కోర్టు అతడి నిర్బంధానికి ఉత్వర్వులు జారీ చేయటంతో బుధవారం అరెస్టయ్యాడు. నీరవ్ మోదీ లండన్లో మారు వేషాలతో వజ్రాల వ్యాపారం చేస్తున్నారని లండన్ పత్రిక ఒకటి ఇటీవల ఒక కథనాన్ని ప్రచురించింది. నీరవ్ లండన్ నగర వీధుల్లో చాలా స్వేచ్ఛగా తిరగటానికి సంబంధిచిన వీడియోను బ్రిటిష్ పత్రిక ది టెలిగ్రాఫ్ విడుదల చేసింది. సీబీఐ బృందం కూడా లండన్ వెళుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos