న్యూఢిల్లీ : ‘ఒకే దేశం… ఒకే రేషన్ కార్డు’ విధానాన్ని దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వలస కార్మికులకు దేశంలో ఎక్కడైనా ఆహార ధాన్యాల్ని తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉన్నా వాటా ప్రకారం తిండి గింజల్ని తీసుకోవచ్చని వివరించారు. సోమవారం 2021-22 బడ్జెట్ ను లోక్సభలో ప్రవేశ పెట్టారు.