యూట్యాబ్ ట్రేండింగ్ లో #2 వ స్థానంలో అర్జున్ సురవరం

  • In Film
  • March 6, 2019
  • 178 Views
యూట్యాబ్ ట్రేండింగ్ లో #2 వ స్థానంలో అర్జున్ సురవరం

ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో ఇప్పుడిప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుంటున్న యువ హీరోల్లో నిఖిల్‌ కూడా ఒకరు.కెరీర్‌ ఆరంభంలో సినిమాల ఎంపికలో తడబడి కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టుకున్న నిఖిల్‌ స్వామిరారా సినిమాతో సక్సెస్‌ బాట ఎక్కాడు.అప్పటి నుంచి విభిన్న కథలతో సినిమాలు తీస్తూ హిట్లు అందుకుంటున్నాడు.ఈ క్రమంలో నిఖిల్‌,లావణ్య త్రిపాఠి జంటగా తెరకక్కిన కొత్త చిత్రం అర్జున్‌ సురవరం టీజర్‌ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ అర్జున్‌ లెనిన్‌ పాత్రలో నిఖిల్‌ నటించిన ఈ టీజర్‌ యూట్యూబ్‌ ఇండియా ట్రెండ్స్‌లో #2వ స్థానంలో ట్రెండింగ్‌ అవుతోంది.’వెతికేవాడు దొరకట్లేదు..వెతకాల్సిన వాడు తెలియట్లేదు’ అంటూ నిఖిల్‌ చెప్పిన డైలాగులతో విడుదల చేసిన టీజర్‌ను ఇప్పటి వరకు 2.8 మిటియన్ల మంది వీక్షించారు.ఈ టీజర్‌కు సాధారణ ప్రేక్షకులతో పాటు మెగాస్టర్‌ చిరంజీవి నుంచి ప్రశంసంలు దక్కాయి.తమిళ సూపర్ హిట్ సినిమా ‘కనిదన్’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ‘అర్జున్ సురవరం చిత్రానికి ఒరిజినల్ వెర్షన్ కు దర్శకుడు టీ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చ్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos