సరికొత్త పాత్రలో
మెగా డాటర్ నిహారిక నటించిన సూర్యకాంతం చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన
నేపథ్యంలో చిత్రం గురించి విశేషాలు పంచుకున్న నిహారిక కెరీర్ గురించి కూడా పలు ఆసక్తికర
విషయాలు పంచుకుంది.మన చేతికి వచ్చిన అవకాశాలు అనుకోని కారణాల వల్ల ఇతరులకు వెళ్లిపోతుంటాయి.అలా
వెళ్లిన చాలా చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచిపోతుంటాయని తెలిపింది.అలాంటి అనుభవమే
నాకు కూడా ఎదురైందని తెలిపింది.రామ్ కెరీర్‌లోనే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన నేను
శైలజ చిత్రంలో హీరోయిన్ అవకాశం ముందు తనకే వచ్చిందని నిహారిక తెలిపింది.ఆ సమయంలో ఇంకా
సినిమాల్లో నటించడానికి ఇంట్లో పెద్దలను ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నానని అందుకే నేను
శైలజ చిత్రంలో నటించలేకపోయానని తెలిపింది.నా కోసం దర్శకుడు నెల రోజుల పాటు ఎదురు చూశాడని
కానీ నా దగ్గరి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో కీర్తి సురేశ్‌కు పాత్ర వెళ్లిపోయిందని
తెలిపింది.అలా నా వరకు వచ్చి చేజారిన నేను శైలజ చిత్రం విజయవంతం కావడం అందులో హీరోయిన్‌గా
నటించిన కీర్తి సురేశ్‌కు మంచిపేరు రావడం తనకు సంతోషాన్ని కలిగించినా మంచి అవకాశం చేజారిందనే
బాధ కలిగిందని తెలిపింది..