లైఫ్‌లో ఒక్కసారైనా ఈ బార్‌కు రావాల్సిందే..

  • In Film
  • March 12, 2019
  • 189 Views
లైఫ్‌లో ఒక్కసారైనా ఈ బార్‌కు రావాల్సిందే..

బుల్లితెరపై
హుషారైన యాంకరింగ్‌తో పాటు రెండు చిత్రాలు ఒక వెబ్‌సిరీస్‌తో కాస్తోకూస్తో అభిమానులను
సంపాదించుకున్న మెగా డాటర్‌ నిహారిక సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు అభిమానులతో
టచ్‌లో ఉంటూ అన్ని విషయాలు పంచుకుంటుంటారు.ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం విశాఖపట్టణానికి
వచ్చిన సందర్భంగా నిహారిక పోస్ట్‌ చేసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా
మారింది.విశాఖలో ఓ బార్‌ చాలా ఫేమస్‌ అని వినడంతో బార్‌ను చూసేందుకే ఇక్కడికి వచ్చామని
బార్‌ చూశాక ఈ బార్‌కు రాకపోయి ఉంటే జీవితమే వృథా అనే ఫీలింగ్‌ కలిగిందంటూ పోస్ట్‌
చేశారు.అయితే నిహారిక బార్‌ గురించి పోస్ట్‌ చేయగానే కొంత ఆశ్చర్యానికి,షాక్‌కు గురైన
ఆమె అభిమానులు అసలు విషయం తెలిశాక ఊపిరి పీల్చుకున్నారు.ఇంతకీ విషయం ఏంటంటే నిహారిక
వచ్చింది మందుతాగే బార్‌కు కాదు.అనేక రకాలు డెసర్ట్స్‌ అందించే బేకర్స్‌ కాస్టల్‌ అనే
డెసర్ట్స్‌ బార్‌.ఇక్కడ డెసర్ట్స్‌ తినకపోతే జీవితమే వృథా అని స్నేహితులు చెబితే వాటిని
టేస్ట్‌ చేయడానికి ఇక్కడికి వచ్చానంటూ అసలు విషయం చెప్పారు.బేకర్స్‌ కాస్టల్‌లో డెసర్ట్స్‌
టేస్ట్‌ చేశాక ఇక్కడే ఇళ్లు తీసుకొని ఉండిపోవాలనిపించేంత ఇష్టం ఏర్పడిందదంటూ చమత్కరించారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos