మెగాస్టార్ చిరంజీవి మినహా మిగిలిన కుటుంబ సభ్యులు మొత్తం పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే.కొన్ని అనివార్య కారణాల వల్ల చిరంజీవి ఇప్పటివరకు ఎక్కడ కూడా జనసేనపై వ్యాఖ్యానించలేదు.తాజాగా జనసేనపై ఇప్పటి వరకు ఎటువంటి వ్యాఖ్యలు చేయని మెగా డాటర్ నిహారిక కూడా తన బాబాయ్ స్థాపించిన జనసేనకు మద్దతుగా వ్యాఖ్యలు చేసింది.నిహారిక నటించిన కొత్త చిత్రం సూర్యకాంతం సినిమా ప్రమోషన్‌లలో భాగంగా నిహారిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తోంది.ఈ క్రమంలో సినిమా గురించి మాట్లాడుతుండగా అభిమానులు పవర్‌స్టార్ నినాదాలు చేస్తూ గోల చేశారు.దీంతో పవన్‌కళ్యాణ్,జనసేన గురించి నిహారిక కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.పవన్‌కళ్యాణ్ అసలుపేరు కొణిదెల కళ్యాణ్‌కుమార్ అని ఆయన మా నాన్నకు,చిరంజీవి గారికి తమ్ముడని నాకు బాబాయని ముద్దుగా మాట్లాడింది.ప్రజల కోసం బాబాయ్ జనసేన పార్టీ పెట్టారని నాకు ఆంధ్రప్రదేశ్‌లో ఓటు లేదు కాబట్టి మీరంతా జనసేనకు ఓటెయ్యాలంటూ సూచించింది.టీ గ్లాస్‌తో ఒక ఫోటో ఉంటుంది దాన్ని ఎన్నికల సమయంలో పోస్ట్ చేస్తానని తెలిపింది.ఇక నిహారిక,రాహుల్ విజయ్ జంటగా నటించిన సూర్యకాంతం టీజర్‌కు మంచి స్పందన లభించింది.మార్చ్29వ తేదీన సూర్యకాంతం చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది..