తిరువనంతపురం : రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేరళ ప్రభుత్వం మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీపీ. జోయ్ అధ్యక్షతన సోమవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేరళలో ఆదివారం 18,257 కేసులు నమోదయ్యాయి. తద్వారా ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 12.39 లక్షలకు పెరిగింది. రాష్ట్రంలోకి ప్రవేశించే వారంతా విధిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.