చెన్నై: జాతీయ దర్యాప్తు సంస్థ-ఎన్ఐఏ గురువారం కోయిం బత్తూర్ జిల్లాలో ఏడు చోట్ల తనిఖీలు చేసి ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్స్, సిమ్ కార్డులు, పెన్డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నాయి. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్ర సంస్థ కార్యకలాపాలు, శ్రీలంకలో ఈస్టర్ రోజు జరిగిన బాంబు దాడుల పై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ సోదాల్ని చేసారు.వీటిలో తమిళనాడు పోలీసులూ పాల్గొన్నారు. తమిళనాట ఐఎస్ఐఎస్ సూత్రధారిగా భావిస్తున్న మహ్మద్ అజారుద్దీన్ను ఎన్ఐఏ అధికారులు గత జూన్లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీలంక మానవ బాంబు జహ్రాన్ హషిమ్కు అజారుద్దీన్ ఫేస్బుక్ మిత్రుడు.