నగరి కమిషనర్‌పై సస్పెన్షన్‌ వేటు

నగరి కమిషనర్‌పై సస్పెన్షన్‌ వేటు

అమరావతి : చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కరోనా నివారణపై ఆయన చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహిత్యంగా ఉన్నాయని ఈ చర్య తీసుకుంది. నగరి మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేసినట్లు మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఆయన స్ధానంలో ఇన్చార్జ్ కమిషనర్గా సానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావును నియమించారు. నగరిలో కరోనా కేసులు పెరుగుతున్నా తమకు రక్షణ కవచాలు లేవని తను తీసిన సెల్పీ వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనాన్ని రేపింది. అత్యవసర పరిస్థితిలో డబ్బులు ఖర్చు చేద్దామనుకుంటే అకౌంట్ ప్రీజ్ అయినందున చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఎమ్మెల్యే రోజా ఇచ్చిన డబ్బులతోనే తాము సహాయక కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఇదంతా ప్రసార మాధ్యమాల్లో, పత్రికల్లో ప్రచారమయ్యాయి. వెంకటరామిరెడ్డి ప్రభుత్వం నింబంధనలు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆయనపై ప్రభుత్వం వేటు వేసింది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos