అయోధ్య తీర్పు అనుకూలంగా రావడంతో ఇకపై కాశీ, మధురల్లోని వివాదాస్పద స్థలాలపై దృష్టిసారిస్తామని బీజేపీ మాజీ ఎంపీ, బాబ్రీ కూల్చివేతలో కీలకంగా వ్యవహరించిన వినయ్ కటియార్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన కటియార్ అయోధ్య తీర్పుపై స్పందిస్తూ తమ తదుపరి అడుగులు వారణాసిలోని కాశీవిశ్వనాథ దేవాలయం, మధురలోని శ్రీకృష్ణ మందిరాల వైపే పడనున్నాయని, ఈ సమస్యలపై దృష్టిసారిస్తామని తెలిపారు. వారణాసిలోని కాశీవిశ్వనాథుని ఆలయం, జ్ఞానవాసి మసీదు పక్కపక్కనే ఉంటాయి.1669లో ఇక్కడి ఆలయాన్ని ధ్వంసం చేసి జ్ఞానవాసి మసీదు నిర్మించారన్నది వీరి వాదన. అలాగే, శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి దేవాలయం పక్కనే సాహీ ఈద్గా మసీదు ఉంది. కేశవనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేసి ఔరంగజేబ్ అక్కడ మసీదు నిర్మించాడన్నది మరో ఆరోపణ. ఈ వివాదాస్పద అంశాలనే కటియార్ ప్రస్తావిస్తూ తదుపరి తమ అడుగులు అటువైపే అని ప్రకటించాడు.