డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే జైలుకే..

డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే జైలుకే..

ట్రాఫిక్‌ నిబంధనలపై ఎంతగా అవగాహన కల్పించినా ప్రజలు వాటిని పెడచెవిన పెడుతున్న నేపథ్యంలో ఇకపై నిబంధనలు పాటించని వాహనదారులతో కఠినంగా వ్యవహరించడానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ట్రాఫిక్‌ పోలీసులు నిర్ణయించుకున్నారు.డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే ఇప్పటి వరకు ఫైన్లు మాత్రమే వేసే ఈ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్ . ఏపీలో వాహనచోదకులకు షాక్ ఇస్తుంది ఏపీ సర్కార్. లైసెన్స్ లేకపోతే జరిమానా విధించకుండా ఏకంగా జైలుకు పంపించాలని తీసుకున్న నిర్ణయం ఏపీలో వాహన చోదకులకు చెమటలు పట్టిస్తుంది.రోడ్డు భద్రత కోసం రవాణాశాఖ తమ రూల్స్‌ను కఠినతరం చేయనుందని రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలను 20 శాతం తగ్గించాలనే ఉద్దేశంతో రవాణా శాఖాధికారులు పోలీసులతో కలిసి సంయుక్తంగా డ్రైవింగ్ లైసెన్సుల తనిఖీలను చెయ్యనున్నారు.అయితే ఇన్నిరోజులు కూడా కేవలం జరిమానాలతో సరిపెట్టిన రవాణా శాఖ, ఎంతకీ వాహన దారుల ప్రవర్తన మారకపోవడంతో, డ్రైవింగ్ లైసెన్సులు తీసుకోకపోవటంతో ఇకనుండి రూల్స్ ని పాటించకుండా , డ్రైవింగ్ లైసెన్స్ లేనివారిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos