న్యూ ఢిల్లీ: మారుతి సుజుకీ మల్టి పర్పస్ వెహికల్ ఎర్టిగా(పెట్రోల్ రకం- బీఎస్-6 ఉద్గార ప్రమాణాలు)ను విపణిలోకి విడుదల చేసింది.దీని ధర రూ. 7,54,689(ఎక్స్‌షోరూం దిల్లీ)లని సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ‘ప్రభుత్వం విధించిన గడువు కంటే చాలా ముందుగా బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాలను తీసుకొస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు మేం కట్టుబడి ఉన్నాం. బీఎస్-6 పెట్రోల్ వాహనాలు చాలా తక్కువ స్థాయిలో ఉద్గారాలను విడుదల చేస్తాయి. దీని వల్ల పర్యావరణానికి మేలు చేసిన వాళ్లమవుతాం. నిబంధనలు అమల్లోకి రాకముందే మా ఉత్పత్తులు అన్నింటినీ ఈ ప్రమాణాలతో ఆధునీకరిస్తా’మని తెలిపారు.