హొసూరు : తమిళనాడు రాష్ట్రంలో యూనియన్ చైర్మన్ ఎన్నికలను శనివారం నిర్వహించారు. గత నెల 27, 30 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలకు రెండు విడతలుగా ఎన్నికలు జరుగగా, ఈ నెల 2న ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఎన్నికలలో కౌన్సిలర్లుగా గెలుపొందిన వారు యూనియన్ చైర్మన్లను ఎన్నుకున్నారు. హొసూరు యూనియన్ చైర్‌పర్సన్‌గా ఏడీఎంకే పార్టీ మహిళా అభ్యర్థి వెంకటస్వామి శశి
ఎన్నికయ్యారు. సూలగిరి యూనియన్ చైర్‌పర్సన్‌గా మధు లావణ్య, కెలమంగలం చైర్మన్‌గా
సీపీఐకి చెందిన కేశవన్, తళి యూనియన్ చైర్మన్‌గా డీఎంకే పార్టీకి చెందిన శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. ఎన్నికైన చైర్మన్ల మద్దతుదారులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుని స్వీట్లు పంచిపెట్టారు.