హైదరాబదు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విద్యుత్ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర శాసనసభ మంగళవారం ఏకగ్రీవంగా తీర్మానించింది. తీర్మానాన్ని ప్రవేశ పెట్టటానికి ముందు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రసంగించారు. ‘కొత్త చట్టం జనాల పాలిట భారంగా పరిణమించబోతోంది. ముఖ్యంగా రైతులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చబోతోంది. కేంద్ర తీసుకొస్తున్న విద్యుత్ చట్టం ఏమాత్రం అంగీకారయోగ్యం కాదు. దీన్ని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఈ చట్టం ఉంది. రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కొత్త చట్టం ప్రకారం కేంద్ర నుంచి విద్యుత్తును కొనాల్సి ఉంటుంద’ని అసహనం వ్యక్తం చేశారు.