గూండాల రాజ్యం

గూండాల రాజ్యం

న్యూ ఢిల్లీ : ఉత్తర ప్రదేశ్లో గూండాలు రాజ్యమేలుతున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. మేన కోడలిని వేధించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్ విక్రమ్ జోషి సోమవారం అర్థ రాత్రి హత్యకు గురవటం తెలిసిందే. ‘ప్రజలకు రామరాజ్యాన్ని అందిస్తామని వాగ్దానం చేసిన యోగి సర్కార్ గూండాల రాజ్యాంగా మారింది. యుపిలో శాంతి భద్రతల విఘాతానికి ఈ ఘటన మరో ఉదాహరణ. గత ఆరేళ్లుగా మీడియాపై భాజపా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందనేందుకు విక్రమ్ జోషి దాడి నిదర్శనం. తాము నిర్భయమైన జర్నలిజం వైపు నిలబడ్డామ’ని ట్విటర్లో పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos