ముంబై:స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో వ్యాపారాన్ని ఆరంభించాయి.ఉదయం 9.49 గంటల వేళకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 175 పాయింట్లు లాభపడి 40,995 వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 12,088 వద్ద నిలిచాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.33 వద్ద దాఖలైంది. యస్ బ్యాంక్, టాటా మోటార్స్, ఎమ్ అండ్ ఎమ్, హెచ్డీఎఫ్సీ, ఐషర్ మోటార్స్ లాభాల్ని గడించాయి. సిప్లా, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జీ ఎంటర్టైన్మెంట్, బీపీసీఎల్ షేర్లు నష్ట పోయాయి. ఆటో రంగ వృద్ధికి ఊతమిచ్చేలా ప్రభుత్వం చర్యల్ని తీసుకోనుందనే సంకే తాలు వాహన రంగ షేర్లు లాభాల్ని గడించేందుకు కారణమని విశ్లేష కులు తెలిపారు.