షోయబ్‌ మాలిక్‌ ఎటకారానికి ఇండియన్స్‌ కారం..

  • In Sports
  • December 27, 2019
  • 203 Views
షోయబ్‌ మాలిక్‌ ఎటకారానికి ఇండియన్స్‌ కారం..

పాకిస్థాన్‌ దేశమే కాదు పాక్‌ క్రికెట్‌ జట్టు క్రికెటర్లు సైతం భారత్‌పై విషం కక్కడం మొదలుపెట్టారు.తాజాగా క్రిస్మస్‌ సందర్భంగా సోషల్‌ మీడియాలో ‘మేరీ క్రిస్మస్‌ దోస్తోం.. వెరీ హ్యాపీ డిసెంబర్‌ 25’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతూ పాక్‌ మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. ఈ ఫోటోలో మాలిక్ విజయం సాధించిన సంతోషంలో ఉండగా… మరోవైపు నిరాశగా వెనుదిరుగుతున్న మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఉన్నాడు.దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భారత అభిమానులు,నెటిజన్లు షోయబ్‌కు అంతే ధీటుగా సమాధానం చెప్పగా మరికొంత మంది తిట్లదండకం కూడా అందుకొని షోయబ్‌కు తలంటారు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో షోయబ్ మాలిక్‌ డకౌటైన ఫోటోతో పాటు రోహిత్‌ కాళ్ల ముందు మాలిక్‌ పడిపోయిన ఫోటోలను రీట్వీట్‌ చేస్తూ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos