ఆమ్‌స్టర్‌డామ్: యుట్రెక్ట్ నగరంలో ట్రామ్‌లో వెళుతున్న ప్రయాణికులపై ఓ దుండగుడు హఠాత్తుగా కాల్పులు జరపడం కలకలం సృష్టిస్తోంది. న్యూజిలాండ్‌లో జరిగిన మారణ హోమాన్ని మరిచిపోక ముందే ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో నెదర్లాండ్స్ గజ గజ వణికిపోయింది. ఈ సంఘటనలో
ఏడుగురు మరణించగా, అనేక మంది గాయపడినట్లు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 10.45 గంటలకు ఒటోబెర్ల్‌పీన్ జంక్షన్ నుంచి ట్రామ్ బయలుదేరింది. కొద్ది సేపటికే ప్రయాణికుల మధ్య నుంచి ఓ వ్యక్తి లేచి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. తర్వాత పారిపోయాడు. ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురై ట్రామ్ నుంచి దూకి పరుగులు తీశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. దీని వెనుక ఉగ్రవాదుల హస్తముందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.