జెరూసలేం: నెతన్యాహూ సర్కార్ కుప్పకూలింది. నిర్ణీత సమయంలో బడ్జెట్ ఆమోదం పొందడంలో నెతన్యాహు ప్రభుత్వం విఫలమవ్వడంతో మంగళవారం ఆ దేశ పార్లమెంట్ రద్దైంది. దీంతో ఏడు నెలల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. వచ్చే ఏడాది మార్చి 23న ఇజ్రాయిల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో గత రెండేళ్లలో నాలుగోసారి ఎన్నికలు జరగనున్నాయి. నిరుడు ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. దీంతో బెన్నీ గట్జ్తో నెతన్యాహు చేతులు కలిపారు. ఇద్దరూ కలిసి అధికారాన్ని పంచుకుందామనే ఒప్పందంతో ఏడు నెలల కిందట సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది నవంబర్లో గట్జ్కు అధికారాన్ని బదలాయించాలి. నెతన్యాహు అందుకు సంసిద్ధంగా లేదు. ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంతోనే బడ్జెట్ను ఆమోదించుకోలేదని పరిశీలకులు చెబుతున్నారు. కరోనా టీకా పై విస్తృతంగా ప్రచారం చేస్తూ ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు.