లఖ్నవ్ : అయోధ్య భూ వివాదం ప్రజల మనో భావాలు గాయపడేలా అభ్యంతరకరమైన, వివాదాస్పదమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఉత్తర ప్రదేశ్ పోలీసులు సామాజిక మాధ్యమ వినియోగదారుల్ని ఉత్తర ప్రదేశ్ పోలీసులు హెచ్చరించారు. సామాజిక మాధ్యమ సాధనాలతో శాంతి భద్ర తల్ని దెబ్బ తీస్తే ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని పోలీసు డైరెక్టర్ జనరల్ ఓపీ. సింగ్ వెల్ల డిం చారు. సామాజిక మాధ్యమాల వేదికల పర్య వేక్షణకు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసినట్లు వివిరంచారు.