న్యూ ఢిల్లీ:భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రాసిన లేఖల విషయంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. నెహ్రూ రాసిన లేఖలను తిరిగి అప్పగించాలని ప్రధానమంత్రి సంగ్రహాలయం కోరింది. 2008లో ఆ లేఖలను సోనియా గాంధీ తీసుకెళ్లినట్లు పేర్కొంది. వాటిని తిరిగి అప్పగించే విషయంలో సహకరించాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. నెహ్రూ మెమోరియల్ 1971లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి అప్పగించింది. అయితే 2008లో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆ లేఖలను సోనియా గాంధీకి పంపారు. అప్పటి నుంచి అవి సోనియా వద్దే ఉన్నాయి. ఆ లేఖలను తిరిగి అప్పగించాలని ఈ ఏడాది సెప్టెంబర్లోనే ప్రధాన మంత్రి లైబ్రరీ కోరింది. దీనిపై స్పందించకపోవడంతో రాహుల్ గాంధీకి డిసెంబర్ 10న మరోసారి లేఖ రాసింది. కనీసం ఫొటో కాపీలు లేదా డిజిటల్ కాపీలైనా అందజేయాలని అందులో కోరింది.